బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల పరిధిలో ఇద్దరి బాధితుల తమ ఫోన్లను పోగొట్టుకోవడంతో అట్టి ఫోన్లను భిక్కనూరు ఎస్సై సాయికుమార్ రికవరీ చేశారు. ఫోన్లు పోగొట్టుకున్న ఇద్దరు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారి ఫిర్యాదు మేరకు ఎస్సై సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో వాటిని రికవరీ చేశారు. రికవరీ అయిన సెల్ ఫోన్లను బాధితులకు పిలిపించి శనివారం స్టేషన్ లో ఏ ఎస్ ఐ జగదీష్ అందజేశారు.
