మోర్తాడ్, బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని మోర్తాడ్ ఏపిఎం ప్రమీల అన్నారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ, ధర్మోరా, డొంకల్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మొదటి విడత ఏకరూప దుస్తువులు గురువారం సిసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ప్రభుత్వ బడుల్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం అలాగే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తో విద్య బోధించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, ఐకెపి వివో లు వనిత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
