26.3 C
Hyderabad
Monday, August 3, 2026

సరళీకృత విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను గట్టి ఎక్కించిన మహా మేధావి పీవీ 

Must read

📰 Generate e-Paper Clip

మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ..

సరళీకృత విధానాలతో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించి, ప్రపంచీకరణ నేపథ్యంలో సంస్కరణలతో దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించిన దార్శనికుడు, మాజీ ప్రధాని
పీవీ నరసింహారావు అని మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం పివి వర్ధంతి సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాములపర్తి వేంకట నరసింహారావు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 వరకు పనిచేశరాని అన్నారు. ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు ఆయన అని అన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి ఆయన అని గుర్తు చేశారు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పి.వి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. అట్లాగే రైతన్నలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, బీ ఆర్ ఎస్ నాయకులు తెలంగాణ శంకర్, శేఖర్ రాజు, అగ్గు సంతోష్, రమేష్, విజయ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

More articles

Latest article