సరళీకృత విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను గట్టి ఎక్కించిన మహా మేధావి పీవీ 

మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ.. సరళీకృత విధానాలతో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించి, ప్రపంచీకరణ నేపథ్యంలో సంస్కరణలతో దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించిన దార్శనికుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం పివి వర్ధంతి సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాములపర్తి వేంకట నరసింహారావు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి...