26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వైధిక ధ్యాన యోగ కేంద్రంలో పుత్ర కామేష్టి యజ్ఞం

Must read

📰 Generate e-Paper Clip

  • చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్

 

ఆర్మూర్, బతుకమ్మ :  జిల్లాలోని ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని వైదిక ధ్యాన యోగ కేంద్రం ఆశ్రమంలో లోక కల్యాణర్థం,సంతాన లేమి దంపతుల కోసం పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు చరిత్రకారుడు, కవి కంకణాల రాజేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ ద్వి అష్టోత్తర సహస్ర గాయత్రీ, మృత్యుంజయ సహిత సామవేద పారాయణ మహా యజ్ఞంలో భాగంగా సంతానం లేని దంపతుల ఆవేదన, విజ్ఞప్తిని దయార్థ్ర హృదయంతో పరిశీలించి ఈ నెల 22 న మిథున రాశి,భరణి నక్షత్రం ను పురస్కరించుకొని విశేష “పుత్ర కామేష్టి” యజ్ఞాన్ని నిర్వీహిస్తున్నట్లు  తెలిపారు.ఆశ్రమ వేద విద్వాంసులు శ్రీశ్రీశ్రీ శ్రీధరానంద భారతీస్వామి, వైదిక పురోహితులు శ్రీశ్రీశ్రీ వేద పునీతానంద స్వామీజీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష యజ్ఞ కార్యక్రమం లో పాల్గొనడం ఎంతో భాగ్యకరమని, సుదీర్ఘ కాలానంతరం ప్రత్యేక శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమాన్ని చక్కటి ప్రణాళికతో, అన్ని వసతి సౌకర్యాలతో నిర్వహిస్తున్నారని  తెలిపారు.సంతానం లేని దంపతులు తమ దైవిక అనువంశిక దోషాలను తొలగించుకునేందుకు, ఉత్తమ సంతానం పొందేందుకు ఇది సువర్ణావకాశం అని అన్నారు. కావున ఆసక్తి గల దంపతులు పూర్తి సమాచారం కోసం 8106941500 మొబైల్ నంబర్ సంప్రదించాలని, ఆశ్రమ నిర్వాహకులకు ముందస్తు సమాచారం అందజేసి యజ్ఞంలో పాల్గొనగలరని ఆయన కోరారు.

More articles

Latest article