27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ: ధాన్యాన్ని గత పదిరోజులుగా ఆరబోస్తున్న రైతులకు ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ర్ట నాయకుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నాపూర్ లో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దళారులు అడిగిన ధరకు రైతులు ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తామని ప్రకటించడం పద్దతి కాదని, రైతులు సాగు చేసిన అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

More articles

Latest article