-ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
-ఫోర్ స్టార్ మీడియా ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ముషాయిరా
-అంతర్ రాష్ట్ర కవుల హాజరు
-ముషాయిరా విజయవంతం
నిజామాబాద్, బతుకమ్మ : ప్రజా సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శనివారం రాత్రి ఫోర్ స్టార్ మీడియా ఆధ్వర్యంలో నగరంలోని ఖోజా కాలనిలో ప్రపంచ ఉర్దూ డే సందర్భంగా ఆల్ ఇండియా ముషాయిరా నిర్వహించారు. ఈ ముషాయిరా లో దేశంలోని ప్రముఖ హిందీ, ఉర్దూ కవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ని అన్ని మతాల ప్రజలకు సమ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్ వల్ల ఇప్పటి వరకు సుమారు 22 లక్షల విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందారన్నారు.

తల్లిదండ్రులు విద్యకు ప్రాతినిధ్యత ఇవ్వాలని, చదువు వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించగా, వారిని సన్మానించారు. ప్రముఖ కవులైన హాశం ఫిరోజాబాది, సూఫీయాన్ ప్రతాపగరి, ఖుష్బూ శర్మ, రాజీవ్, టిపికల్ జగిత్యాలి, ఖదీర్ తమీమ్ ల కవిత్వాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఫోర్ స్టార్ మీడియా బాధ్యులు మాజిద్, నైమ్ ఖమర్, గౌస్, అఫ్జల్ లు అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ ముషాయిరా తెల్లవారు జామున 3 గంటల వరకు సాగింది.

