దుబ్బాక , బతుకమ్మ :
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ ఇందుప్రియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ లాబరేటరీ , కంప్యూటర్ ల్యాబ్ ను అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గడ్డమీది రేఖ స్వామి , ప్రధానోపాధ్యాయులు ఎండి అఫ్జల్ లు ప్రారంభించారు. గ్రామంలోని శుక్రవారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , స్కూల్ చైర్మన్ రేఖ స్వామి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు కంప్యూటర్ మరియు లాబరేటరీలతో ఎంతో నైపుణ్యం చేకూరుతుంది తీరితోపాటు ప్రాక్టికల్స్ చేయడం ద్వారా విద్యార్థుల మేధస్సు పెరుగుతుందని తెలిపారు. అలాగే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలతో మంచి ఫ్యాకల్టీతో ఇంగ్లీష్ మాద్యంలో బోధన జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు రావాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, తదితరులు, పాల్గొన్నారు
