25.4 C
Hyderabad

లోక్ అదాలత్ లో ప్రజా ప్రయోజనాలే కలగలసి ఉన్నాయ్

Public interests are intertwined within the Lok Adalat

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి దారావత్ దుర్గా ప్రసాద్

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : 

జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ వలన కక్షిదారులకు చట్టాల ప్రయోజనాలు త్వరితగతిన అందుతాయని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ దారావత్ దుర్గా ప్రసాద్ అన్నారు.జాతీయ లోక్ అదాలత్ ను జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఆయన న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.రాజీపద్ధతిన న్యాయ వివాదాలను పరిష్కరించుకున్న న్యాయార్థులు సంతోషకరమైన జీవనాన్ని కొనసాగిస్తారని తెలిపారు.సివిల్, క్రిమినల్ కేసులలో కోర్టు వెలుపల ఎన్నో పంచాయతీలు జరిగి చివరికి కోర్టులో రాజీపడి పరిష్కరించుకోవడం ముదావాహమని అన్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టులు అద్భుతమైన అవకాశాన్ని కల్పించి కక్షిదారుల మధ్య సూహృధ్భావ వాతావరణాన్ని కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కక్షిదారులు న్యాయవాదులతో సంప్రదించి సముచితమైన పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కోరారు.న్యాయసేవల చట్టంతో ఎనలేని ప్రయోజనాలు చేకూరుతాయని జడ్జి దుర్గా ప్రసాద్ వివరించారు. అదనపు జిల్లా కలెక్టర్ భుజంగ రావు మాట్లాడుతూ కక్షిదారులకు న్యాయాన్ని అందించడంలో ఎన్నో వెలుసుబాట్లు కోర్టులు కల్పిస్తున్నాయని అన్నారు. లోక్ అదాలత్ అంటేనే ప్రజా కోర్టులని ప్రజలు లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోర్టులలో కోర్టు ఫీజు చెల్లించి సివిల్ కేసులు వేసినవారు వాటిని లోక్ అదాలత్ లో పరిష్కరించుకున్న వాటికి తిరిగి కోర్టు ఫీజు చెల్లించడంలో జరుగుతున్న జాప్యాన్ని తొలగించడానికి జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థకు ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు రాజీ పడదగిన క్రిమినల్ కేసులను గుర్తించి లోక్ అదాలత్ లో పరిష్కరించుకునే విదంగా అందరిని ప్రోత్సహించినామని నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రకాష్ యాదవ్ తెలిపారు. పౌరుల మధ్య కక్షలు, కార్పణ్యాలు ఉండరాదనే లక్ష్యంతో ఉన్నామని, సమాజంలో శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే సమాజానికి మంచిదని అన్నారు. జూనియర్ సివిల్ జడ్జిలు వడ్డి హరి కుమార్, పాముజుల శ్రీనివాస్ రావు లు మాట్లాడుతూ ప్రజలకు న్యాయసేవలు అందించడంలో తమవంతు బాధత్యలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక మంచి సమాజ నిర్మాణానికి న్యాయసేవ సంస్థ భాగస్వాములతో కలిసి నడుస్తున్నామని వారు పేర్కొన్నారు. సివిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులను త్వరతగతిన పరిష్కరించుకుని కక్షిదారులు తమ దైనందిన పనులలోకి వెల్లి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అభిలషించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ మాట్లాడుతూ మునుటిలాగానే జాతీయ లోక్ అదాలత్ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ముద్దసాని నీలిమ సంస్థ లక్ష్యాలు, ఆశయాలు వివరించారు. కార్యక్రమంలో జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్స్ అంబెం బాలరాజు, నూర్జహన్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ మహమ్మద్ షాదుల్ల, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ శుభం, బాలాజీ, ప్రమోద్, సీనియర్ న్యాయవాదులు మాణిక్ రాజు,చిన్య నాయక్, ఆశ నారాయణ, రవి ప్రసాద్,పోలీస్ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్, భీమా కంపెనీల అధికారులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Public interests are intertwined within the Lok Adalat

More articles

Latest article