25.5 C
Hyderabad

జండా బాలాజి మందిరంలో జండాపూజ కార్యక్రమం ప్రారంభం

Flag worship ceremony begins at the Janda Mandiram

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జండా బాలాజి మందిరంలో ఎంతో వైభవంగా జరిగే జండా జాతర సందర్భంగా జండాపూజ కార్యక్రమం శనివారం  ప్రారంభించారు. జండా జాతర  ఉత్సవములు -2026 శనివారం నుండి 26వ తేది వరకు జరుగుతుందన్నారు. శనివారం జాతర ప్రారంభ కార్యక్రమము శ్రీ స్వామి వారి జండా పూజ జండా ముత్తవల్లి అజయ్ సంగ్వాయ్ స్వగృహం పెద్ద బజార్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆంజనేయులు, ముత్తవల్లి అజయ్ సంగ్వాయ్ కుటుంబ సభ్యులు, జాలిగం గోపాల్, లవంగ ప్రమోద్, మోర సాయిలు, నర్సింగ్ రావ్, బ్రాహ్మణ సమాజ పెద్దలు, భక్తులు నగర వాస్తవ్యులు పాల్గొన్నారు.

 

Flag worship ceremony begins at the Janda Mandiram
Flag worship ceremony begins at the Janda Mandiram

More articles

Latest article