29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బోధన్ లో ప్రజాపాలన విజయోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం లో మున్సిపల్ చైర్ పర్సన్ పద్మావతి ఆధ్వర్యంలో మంగళ వారం ప్రజాపాలన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచనల మేరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ర్యాలీ నిర్వహించామన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వ అమలు చేస్తుండడాన్ని హర్షిస్తూ విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, పట్టణ ఎస్ హెచ్ వో వెంకట్ నారాయణ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. 

More articles

Latest article