28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజాపాలన వ్యాసరచన పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నవీపేట్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన వారోత్సవాలలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నాడు మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ‘ప్రజాపాలన’ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మండలం లోని ప్రభుత్వ, ప్రైవేట్ హై స్కూళ్లకు చెందిన 49 మంది విద్యార్థులు పాల్గొనగా మొదటి బహుమతి సింధుశా బినోల ఉన్నత పాఠశాల, రెండవ బహుమతి లిటిల్ ఫ్లవర్ హై స్కూలుకు చెందిన ఇందుప్రియకు, మూడవ బహుమతి కేజీబీవీ కి చెందిన లక్మి ప్రసన్న గెలుపొందారని ఎంఈఓ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి శివకుమార్, ఉపాధ్యాయులు రాజేంద్రకుమార్, ఎమ్మార్సీ లక్మినారాయణ తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article