29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆస్తులు అమ్ముకుని పోచారం కోసం పని చేశా

Must read

📰 Generate e-Paper Clip

. 30 ఏళ్లపాటు సేవ చేస్తే లక్ష్మణుడు అని ఇప్పుడు విమర్శిస్తున్నారు

. కేసీఆర్ నమ్మి పదవులు ఇస్తే ఆయనను మోసం చేశారు

. మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ విమర్శ

బాన్సువాడ, బతుకమ్మ: తన ఆస్తులు అమ్మకుని పోచారం శ్రీనివాస్ రెడ్డికి 30 ఏళ్లపాటు సేవ చేసినప్పుడు తనను లక్ష్మణుడితో పోల్చి ఇప్పుడు రావణుడు అంటున్నారని మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి  సతీశ్ అన్నారు. తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాల్లో తాను పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్ద పది రూపాయలు తీసుకున్నట్లు రుజువు చేస్తే తన తల నరుక్కుంటానని సవాల్ చేశారు. తన తండ్రి పేరు చెప్పి కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోచారం భాస్కర్ రెడ్డి తనపై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. తనకున్న భూములను అమ్మి నిర్మల్ జిల్లా బైంసా వద్ద 32 ఎకరాల భూమిని కొనుగోలు చేసి బతుకుతుంటే.. 72 ఎకరాల భూమి కొన్నాడని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే తెలంగాణ తిరుమల దేవస్థానం దగ్గరికి వస్తారో, భైరవాపూర్ పాండురంగ విఠలేశ్వర ఆలయానికి వస్తారో చెప్పాలని, 1994లో పోచారం కుటుంబ ఆస్తులెన్ని..? ఇఫ్పుడు ఎంతకు పెరిగాయో లెక్కతో సహా చెబుతానని అన్నారు. పోచారం ను నమ్ముకుని అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్ గా అవకాశం కల్పిస్తే కష్టకాలంలో ఆయనను వదలి వెళ్లిపోయారని విమర్శించారు. నమ్మిన వ్యక్తికి ద్రోహం చేసిన ఘనత మీదేనని భాస్కర్ రెడ్డిని ఉద్దేశించి సతీశ్  ఆరోపించారు. ఇసుక, మొరం మాఫియాను నడిపింది ఎవరో సమాధానం చెప్పాలన్నారు. నోరు ఉందని, తన తండ్రి ఎమ్మెల్యే అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరూ సహించరని మండిపడ్డారు. సమావేశంలో సీనియర్ నాయకులు రాంబాబు, మాజీ సర్పంచ్ మారుతి, పుల్లెం బాబు, మాజీ జెడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్, గంగపుత్ర సంఘం సీనియర్ నాయకులు నర్రా సాయిలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

More articles

Latest article