బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్
ఆర్మూర్, బతుకమ్మ : నూటికి నూరు శాతం అభివృద్ధి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తోనే సాధ్యం అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటి రెడ్డి కి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మంజూరి కొరకు పెట్టిన రోడ్డు, బ్రిడ్జ్ లను తానేఅడిగి మంజూరి చేయించినట్లు కాంగ్రెస్ నాయకులు వినాయరెడ్డి చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు. నూటికి నూరు శాతం అభివృద్ధి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తోనే సాధ్యం.. వినయ్ రెడ్డి అబద్దాలు మాని ఇతర రోడ్ల కొరకు మంజూరి చేయుమని మంత్రులను అడగాలని డిమాండ్ చేశారు. జిల్లా పర్యటన లో మంత్రి ఆర్మూర్ ఎమ్మెల్యే అని వినయ్ రెడ్డి ని కలెక్టర్ కు పరిచయం చేయడం లో మీ ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు. రాజ్యాంగం మీద మీకు నమ్మకం లేదా? ఒక మంత్రిగా ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి, ప్రజల తీర్పును మీరు గౌరవించారా? అంటూ నిలదీశారు. జిల్లా సమావేశం లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కాంగ్రెస్ నాయకులను స్టేజి పైనా కూర్చో బెట్టు కోవడం, ఆర్మూర్ లో మునిసిపల్ కమిషనర్, ఎమ్మార్వో అభిరుద్ది పనుల నిమిత్తం ఓడినా వినయ్ రెడ్డి తో కలసి స్థలాల పరిశీలన చేయడం ఏంటి! జిల్లా కలెక్టర్, అర్ముర్ ఎమ్మార్వో , మున్సిపల్ కమీసినర్ కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ నాయకులతో పర్యటనలు చేయండి. మీకు జితాలు వస్తున్నాయి కాంగ్రెస్ గాంధీ భవన్ నుండి కాదు, మీ జీతాలు ప్రజల సొమ్ము అని గ్రహించండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల్లారా ప్రజా సమ్యాన్ని కాపాడండి లేదా మీ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరండి అని హితవు పలికారు. మీది ప్రజా పాలన కాదు ప్రజల నడ్డి విరిచే పాలన. రైతు సంబురాలు కాదు కాంగ్రెస్ సంబురాలు చేసుకోండి ఎందుకంటే ప్రజలకు చేసింది సూన్యం మీ రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకుంటున్నారని విమర్శించారు.
