బతుకమ్మ, సదాశివ నగర్ :
భూంపల్లి లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ వద్ద స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి గ్రామంలో 200 మొక్కలను నాటారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి వచ్చినప్పటి నుండి భూంపల్లి గ్రామం అభివృద్ధి పరంగా ముందుకు సాగుతుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామంలో పరిశుభ్రత పనులు డ్రైనేజీలు శుభ్రం చేయుట ఇంటింటికి వెళ్లి అవగాహన సదస్సు నిర్వహించడం వల్ల ఇంటి పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి గ్రామపంచాయతీ సిబ్బంది భూంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
