నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలోఅందాల పోటీలకు వ్యతిరేకంగా కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. 72 మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలి అని ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ఆందోళనలు ఉదృతం చేస్తున్నాయి. ఈ సందర్భంగా నాయకులు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సంధ్య, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు అరుణ, స్త్రీ ముక్తి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పోసాని, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్నహత్యలు, అత్యాచారాలు, దాడులు, విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు, ఇండ్ల నిర్మాణం, పింఛను వీటి మీద దృష్టి పెట్టకుండా మిస్ వరల్డ్ అందాల పోటీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులకు ఆదాయం పెంచే పోటీలపై ప్రత్యేక దృష్టి పెట్టడం సీఎం మానుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకన్న ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు పరుస్తారేమో అని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న వారందరికీ నిరుత్సాహపరిచే విధంగా ఈ పోటీలను పెట్టడం కరెక్ట్ కాదని మహిళా సంఘాలు సీఎంకి లేఖలు పంపినా కూడా ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు లేకపోవడం బాధాకరం అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, నాయకులు అమూల్య, మంజుల, గీత, పిఓడబ్ల్యు కార్యదర్శి భారతి, నాయకులు సంజన, లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు, పిడిఎస్యు జిల్లా నాయకులు సంతోష్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
