28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పీడీఎస్ యూ  ఆధ్వర్యంలో నిరసన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలను  చెల్లించాలని పీడీఎస్ యూ  జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.  జిల్లాకేంద్రంలోని సుభాష్ నగర్ లో  పీడీఎస్ యూ  ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కి సంబంధించిన నిధులను గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం విడుదల చేయటం లేదన్నారు.  ఈఏడాది విద్యార్థులే పుస్తకాలు యూనిఫామ్ లు కొనుక్కుంటున్నారని , బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ స్కూల్స్ పాఠశాలలు నిర్వహించలేమని టీచర్లు చేతులెత్తేస్తున్నారన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా రూ. 210 కోట్లు,  జిల్లాలో రూ. 9 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీ ఎస్ యూ నగర నాయకులు మనోజ్,సాయి కిరణ్, వంశీ, రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article