నిజామాబాద్, బతుకమ్మ : పాలస్తి నాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, ఎం సిపిఐయు ల ఆధ్వర్యంలో ఇజ్రాయిల్ దిష్టిబొమ్మల దగ్ధం చేసి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పాలస్తీనా దేశం లోని గాజా పై దాడి చేసి గత సంవత్సర కాలంగా యుద్ధం కొనసాగిస్తున్నారని దీనివల్ల 45 వేల మంది పాలస్తీనా దేశస్తులు మరణించారని తెలిపారు. ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వల్ల పాఠశాల, ఆసుపత్రుల మీద దాడులు చేయడంతో ఆ భవనాల కింద ఎన్ని వేల ప్రాణాలు ఉన్నాయో లెక్కలేని పరిస్థితి ఉందని అన్నారు.
ఐక్యరాజ్యసమితి, న్యాయస్థానం యుద్ధం ఆపమని చెప్పినప్పటికీ అమెరికా ప్రోత్సహంతో ఇజ్రాయిల్ పాలసీనపై దాడులు కొనసాగించడం సబబు కాదని అన్నారు. ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతి నెలకొల్పాలని ఇజ్రాయిల్ ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ ఎం.ఎల్ జిల్లా నాయకులు శివ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు బి లింగం, సిపిఐ నగర కార్యదర్శి వై ఓమయ్య, కె రాజన్న, సిపిఎం నాయకులు నూర్జహాన్, సుజాత, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాజు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ వెంకట్,మరియు బి.రఘురాం, అనిల్, రమేష్, రాధా కుమార్ తదితరులు పాల్గొన్నారు.