27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీజేఐ బీఆర్ గవాయ్ మీద దాడికి నిరసన

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి మీద జరిగిన దాడి పై అంబేద్కర్ సంఘం, దళిత,బహుజన, సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గల అంబెడ్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబెడ్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అట్కారి బబ్లు మాట్లాడుతూ సీజేఐ  గవాయ్  పై కిశోర్ రాకేష్ అనే సీనియర్ న్యాయవాది దాడి జరిపిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ఒక అత్యున్నత హోదాలో ఉన్న  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి ఈ దేశ రాజ్యాంగనికే మాయని మచ్చగా అభివర్ణించారు.  ఎస్సీ ఎస్టీలు అత్యున్నత స్థాయిలో ఉండడాన్ని ఓర్వలేకనే ఇలాంటి వారు కొందరు  ఈ దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి దాడులు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు, బహుజనులు,ప్రజాస్వామ్య వాదులు  ఖండించాలన్నారు. దీనిని మేము ఒక పిరికి పందా చర్యగా భావిస్తున్నామని దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బహుజన సంఘాలు ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు.  ఇది రాజ్యాంగం మీద దేశవ్యాప్తంగా దళితుల మీద  జరుగుతున్నటువంటి దాడిగా భావిస్తున్నామన్నారు. కిషోర్ రాకేష్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఏల్లుబాబు, డివిజన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సాయిలు మండల్ ప్రధాన కార్యదర్శి కుసులకంటి సాయిలు, మండల కోశాధికారి,మొగులయ్య,సాఠేల్లి సాయిలు అడవి లింగాలు శ్రీను,రాజు,విజయ్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article