26.3 C
Hyderabad
Monday, August 3, 2026

భారీ నీటిపారుదల శాఖ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : డా. బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల పురోగతి, ఇటీవల భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పోచారం ప్రాజెక్ట్ బలోపేతం, సిల్ట్ తొలగింపు చర్యలు, అలాగే ప్రాజెక్ట్ ప్రవాహం క్రింద ఉన్న అడవి లాగా మరీనా చెట్ల తొలగింపు వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ సందర్భంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి ని కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఈ అండ్ సి, చీఫ్ ఇంజినీర్లు, సంబంధిత అధికారులు జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంత రావు పాల్గొన్నారు.

More articles

Latest article