. . . మొక్కలు నాటిన పాలకవర్గం
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి సహకార సంఘం చైర్మన్ నోముల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సహకార్ సే సమృద్ధి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు సహకార సంఘం పరిధిలోని వివిధ గోదాముల వద్ద మొక్కలు నాటి వాటి సంరక్షణకు కావలసిన చర్యలను తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ప్రతి సహకార సంఘం పరిధిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చైర్మన్ నోముల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొక్కల సంరక్షణ భవిష్యత్తు రక్షణ గా ఉంటుందన్నారు. వృక్షో రక్షతి రక్షితః అనే పెద్దల నానుడిని ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లవెల్లి సహకార సంఘం వైస్ చైర్మన్ రమేష్, సీఈవో తేజ గౌడ్, సర్పంచ్ రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
