25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏడిఈగా పదోన్నతులు

Must read

📰 Generate e-Paper Clip

  • కంపెనీకి ఏప్రిల్ 4లోగా ఏఆర్ లు  
  •  జిల్లాలో భర్తీ కానున్న పోస్టులు 

నిజామాబాద్, బతుకమ్మ:

ఏఈ నుంచి ఏడిఈగా పదోన్నతులు త్వరలో రాబోతున్నాయి. తెలుగు సంవత్సర కాలమానంలో వారి కల నెరవేరనుంది. సీనియారిటీ జాబితాలో ముందు వరుసలో ఉన్న వారు పదోన్నతులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన ఏఈలను  ఏడిఈ లుగా కూర్చోబెట్టడానికి కంపెనీ సిఎండి సిద్దమయ్యారు. పదోన్నతుల జాబితాలో ఉన్నవారి ఏఆర్ (అన్యువల్ అప్రైసర్ రిపోర్ట్) లను ఏప్రిల్ నాలుగవ తేది లోగా పంపించాలని ఆయా జిల్లాల ఎస్ఈ లకు ఈ నెల 27న ఆదేశాలు జారీ చేసారు. కంపెనీ పరంగా మొత్తం 92 మంది ఏడిఈలుగా పదోన్నతి పొందే జాబితాలో ఉండగా, జిల్లా నుంచి ఆరుగురు ఉన్నారు.

  • నిజామాబాద్ జిల్లా నుంచి… 

నిజామాబాద్ జిల్లాలో  ఏఈ నుంచి ఏడిఈ లుగా పదోన్నతులను తీసుకోనున్నారు. ధర్పల్లి ఏఈ నాగేశ్వర్, ఎంఆర్టి విభాగంలో ఏఈ (టెక్నికల్) దుర్గాప్రసాద్, హెచ్.టి మీటర్ ఏఈ నవీన్ రెడ్డి, కన్స్ట్రక్షన్ విభాగంలో ఏఈ వినోద్, టౌన్-2 లోని ఏఈ జాకీర్ అలీ, ఇన్ హౌస్ ఏఈ సిద్దిరాములు పదోన్నతుల జాబితాలో ఉన్నారు. ఇందులో ఇద్దరు సంస్థ పరమైన న్యాయ చిక్కులలో ఉన్నట్లు తెలిసింది. మిగతా నలుగురికి ఏప్రిల్ 10 లోపు పదోన్నతి రానుందని సహచర ఉద్యోగులు భావిస్తున్నారు. జిల్లాలో మోర్తాడ్, రుద్రూర్, ఈ నెల (మార్చ్) లో ఉద్యోగ విరమణతో ఖాళీ కానున్న టౌన్ 3  ఏడిఈ పోస్టులు ఏఈ నుంచి ఏడిఈ లుగా పదోన్నతి తీసుకున్న వారితో భర్తీ కానున్నాయి.

More articles

Latest article