24 C
Hyderabad
Sunday, August 2, 2026

పాత్రికేయ విలువలు పెంచేల వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కవి, పాత్రికేయులు అన్నవరం దేవేందర్

 

కరీంనగర్, బతుకమ్మ : పాత్రికేయులు తమ పాత్రికేయ వృత్తి విలువలను పెంచే విధంగా వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని ప్రముఖ కవి, పాత్రికేయులు అన్నవరం దేవేందర్ అన్నారు. శనివారం శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ వీడుకొలు, సర్టిఫికెట్ ల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జర్నలిజం సాహసంతో కూడుకున్న వృత్తని దానికి పరీశీలన, పరిశోధన, వాస్తవికత, నిష్పాక్షికత లు ఆభరణాలన్నారు. అనంతరం కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిజం చక్కటి ప్రణాళికతో కూడుకున్నదన్నారు. శీర్షిక నుండి మొదలుకొని ప్రతి అక్షరం, పదం, వాక్యం సమాజపు మేలునుకోరే విధంగా ఉండాలన్నారు. వార్తలు సంచలనాలకన్నా ప్రధానంగా సందర్భ శుద్ధితో కూడి ఉండాలని సూచించారు. తెలుగు విభాగ అధ్యక్షులు డా. బూర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ పాత్రికేయ వృత్తి పరమపవిత్రమయిందని దాన్ని ప్రజల క్షేమం కోసం వాడుకోవాలని అన్నారు. అనంతరం ముఖ్య అతిథి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగ అధ్యాపకులు బూర్ల వేంకటేశ్వర్లు, డా. డి. ప్రకాష్, డాక్టర్ ఆర్ శ్రీనివాస్, మెట్టు వేంకటేశ్వర్లు, డా. పాత అశోక్. డా. పి. చైతన్య, డా. టి. భోజన్న, డా. పి. అనిల్, పి.శంకర్ విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article