పశువదశాల వల్ల ఇబ్బందులు
స్థానికుల ఆందోళన సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిసనర్ కు వినతి పత్రం బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 17, 18వ వార్డుల పరిసరాల్లో పశువదశాల నిర్వహణతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అక్కడి నుండి వెలువడుతున్న వ్యర్థాలు పక్కనే ఉన్న పంటపొలాల్లోకి చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దుర్వాసనతో కూడిన కలుషిత వాతావరణం కారణంగా పంటలు దెబ్బతిని, కూలీలు కూడా పొలాల్లో పని చేయేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలపై రైతులు, కాలనీవాసులు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్...