23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రైవేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజులు వసూలు చేస్తే నిషేధించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలను నిషేధించాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు  చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని, ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ,విద్యాశాఖ  వత్తాసు పలుకుతున్నాయని,  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలంటూ గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాడని,  పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను  విడుదల చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థులు  ప్రభుత్వంకి విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తారని, ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని, విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు, ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్టాప్ లు ఇంకెప్పుడు ఇస్తారని, ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన  ఏఐఎస్ఎఫ్  జిల్లా  ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కన్వీనర్  పసుల శివ  ప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర  సహాయ కార్యదర్శి రఘురాం నాయక్  హాజరయ్యారు. ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నారని ,ప్రభుత్వం  అధిక ఫీజులను నియంత్రించకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు వత్తాసుగా వ్యవహరిస్తుందని, అధిక ఫీజులు వసూలు చేస్తే సీజ్ చేయాలని ఆ దమ్ము ధైర్యం విద్యాశాఖ అధికారులకు లేదని, రాష్ట్ర విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రూపాయి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే ఆ విద్యాసంస్థను నిషేధించాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆర్టీసీ బస్ పాస్ చార్జీలను పెంచడం సరికాదని విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని,  రాష్ట్రంలో విద్యా సంవత్సరం  ప్రారంభం అయిన నేపథ్యంలో సీఎం  రేవంత్ రెడ్డి విద్యారంగంపై సమీక్ష చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి  కృషి చేయాలని విద్యారంగం గాడి తప్పిందని ప్రభుత్వ విద్యాసంస్థల్లో సరైన సౌకర్యాలు  లేవని, ప్రభుత్వ గురుకులాలకు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు బిల్లులు చెల్లించక అందులో చదివే విద్యార్థులు ఇంటి వద్ద ఉండే పరిస్థితి ఉందని, పాఠశాల కళాశాలలో యూనివర్సిటీలలో టీచింగ్ ,నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గురుకులాలు మోడల్ స్కూల్లో, కేజీబీవీ లలో నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి చేయాలని,  ప్రభుత్వం సీఎం నిత్యం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను  అద్భుతంగా నిర్మించాలని, వందల కోట్ల నిధులు ఇస్తున్నామని అంటున్నారు తప్ప ప్రస్తుతం ఉన్న గురుకులాలు, మోడల్  స్కూల్స్ ,కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మౌనిక వసతుల కల్పనపై నిధుల కేటాయింపు పై దృష్టి సాధించడం లేదని, రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తే ఆ పాఠశాల,కళాశాలల గుర్తింపు రద్దు చేసే విధంగా కఠిన చట్టం తేవాలని,  ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థ నిబంధనలు పాటించాలని  లేని పక్షంలో  ఆ  విద్యాసంస్థల ముందు ధర్నాలు చేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం   పెండింగ్ లో ఉన్నఫీజురీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ బకాయిల విడుదల పై ఇచ్చిన మాట తప్పుతున్నారని, ప్రభుత్వానికి గాలి మోటార్లలో తిరగడానికి డబ్బులు ఉంటాయి తప్ప  విద్యార్థులు చదువులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని, విద్యార్థులకు ఓట్లు లేకపోతే వారి తల్లిదండ్రులకు ఉన్నాయని వారు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారని వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని , అన్ని రకాల బకాయిలను విడుదల చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల చదువులకు నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడం సరికాదని, వెంటనే ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయాలని  సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకున్న నేపథ్యంలో అన్ని విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇంజనీరింగ్ కళాశాలల్లో బి కేటగిరి సీట్లను  లక్షల రూపాయలకు అమ్ముతున్న కళాశాలలను బ్లాక్ లిస్టులో పెట్టాలని మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సమావేశములో  ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బానోతు రఘురాం నాయక్, నాయకులు సంపత్, వంశీ సుమన్, గణేష్ , విష్ణు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article