తె.యూ. బతుకమ్మ: ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నుంచి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ మరియు పీజీ కళాశాలల బందుకు పిలుపునిచ్చినట్లు ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి నరాల సుధాకర్ తెలిపారు. ఈమేరకు సోమవారం యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్, ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అతిక్ లకు వినతి పత్రం అందజేశారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలు నడపడం కష్టమైపోయిందని అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్, శ్రీనివాస్ రాజు, గురువేందర్ రెడ్డి, నిషిత రాజు, అరుణ్ కుమార్, రాజేందర్, వెంకట కిషన్, దేవారెడ్డి, అరుణ్ రెడ్డి, హకీమ్, రమణ, అనిల్ రెడ్డి, విజయ్, నవీన్, రాజేశ్వర్ తదితరులు తదితరులు పాల్గొన్నారు
