- డెయిరీ టెక్నాలజీ పెరుగుతున్న డిమాండ్
- ఎంటెక్ కోర్సు కోసం ఢిల్లీకి
- యువతకు ఉద్యోగావకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం
- రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
కామారెడ్డి, బతుకమ్మ : పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం డైరీ కళాశాల తోపాటు రాజంపేటలోని డెయిరీ ని మంత్రి విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇటీవల డైరీ కోర్సుకు బాగా డిమాండ్ పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక డైరీ కళాశాల కామారెడ్డి ఉందని , ప్రస్తుతం బీటెక్ కోర్స్ అందుబాటులో ఉందన్నారు డెయిరీ ఎంటెక్ కోర్సు ప్రారంభించడానికి కళాశాలకు అన్ని అర్హతలున్నాయన్నారు. ఢిల్లీకి వెళ్లి ఎంటెక్ కోర్సులో తీసుకొచ్చేలా కృషి చేస్తానన్నారు. కొంతకాలంగా డెయిరీ కోర్సు చదివిన విద్యార్థులకు ప్రముఖ డెయిరీ కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగావకాశాలు లభిస్తుండటంతో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశాలకు భారీగా డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. గడిచిన పదేండ్లలో ఉద్యోగాల భర్తీలేక విసిగివేసారిన నిరుద్యోగుల జీవితాల్లో కాంగ్రెస్ సర్కార్ సరికొత్త మార్పు

తెచ్చిందన్నారు. తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల మేళా నిర్వహించి, ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా మొదటి ఏడాదిలోనే 53 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు వచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్ కే దక్కుతుందన్నారు. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో విజయ డెయిరీ బలోపేతమైందన్నారు. డెయిరీ అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా అనేక పథకాలను అమలు చేసి రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. టీజీడీడీసీఎఫ్ చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డి డెయిరీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో నిబద్ధతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శిథిలావస్థలో ఉన్న డెయిరీ ని ఆధునీకరించాలని చైర్మన్ మంత్రికి చైర్మన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, డిడి నాగేశ్వరరావు, జీఎం మధుసూదన్, కవిత ధనరాజ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
