నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు, తెలంగాణా రాష్ట్ర మలిదశ పోరాట యోధుడు ప్రముఖ సీనియర్ న్యాయవాది పెద్దగాని కిరణ్ కుమార్ గౌడ్ (57) ఆకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ నగరానికి చెందిన కిరణ్ కుమార్ గౌడ్ సీనియర్ న్యాయవాధిగా జిల్లా కోర్టులో పని చేస్తున్నారు. న్యాయవాదిగా అందరికి సుపరిచితుడే కిరణ్ కుమార్ గౌడ్ బార్ అసోసియేషన్ లోనూ కీలక పదవులను నిర్వర్తించాడు. ఆయన మృతి పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త సంతాపం వ్యక్తం చేశారు.
