30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళా సంఘాల అధ్యక్షులు ఏకగ్రీవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం గ్రామంలోని ఐకెపిలో గురువారం మహిళా సంఘాల అధ్యక్షురాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ కృష్ణ గ్రామ సంఘం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షరాలుగా  బుర్రెం చంద్రవ్వ, ఉపాధ్యక్షురాలు గా ఎస్కే ఆశ బేగమ్, ప్రధాన కార్యదర్శిగా దయ్యపు అనీశవ్వ, సహాయ కార్యదర్శిగా అరేటి ఏలిష, కోశాధికారిగా సిద్ధం శెట్టి స్వరూప లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో పాత ఓబీ లు, క్రొత్త ఓబీ లు, సీసీ  ఎస్.రాజేషం,  వీఓఏ  జయ శ్రీ 38 సంఘాల సభ్యులందరూ పాల్గొన్నారు.మండలం లోని మద్దెల చెర్వు గ్రామం లో నీ   గ్రామ సంఘం లో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. గురువారం నూతన కార్యవర్గం సమావేశంలో అధ్యక్షరాలు గా  జీడిపల్లి కల్పన, ఉపాధ్యక్షురాలు గా మెరుగు గంగమని, ప్రధాన కార్యదర్శి  గా బైరి మల్లేశ్వరి, సహాయ కార్యదర్శి గా బండారి లక్ష్మి , కోశాధికారి  గా  ఒడ్డే సాయ్యవ్వ లను సంఘా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో పాత ఓబీ లు, క్రొత్త ఓబీ లు సీసీ  ఎస్ రాజేషం,  వీఓఏ  పర్వ రెడ్డి 22 సంఘాల సభ్యులందరూ పాల్గొన్నారు.

Presidents of Women's Associations are unanimous

 

More articles

Latest article