పిట్లం , బతుకమ్మ :
పిట్లం మండలంలో నెలరోజుల క్రిందట ప్రమాదంలో మరణించిన లారీ ఓనర్ జబ్బర్ కుటుంబ సభ్యులకు రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో లారీ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని రాజేందర్ చేతులమీదుగా కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. అదివారం తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్ అధ్యక్షులు మాట్లాడుతూ లారీ ఓనర్ల ఆత్మీయ సమ్మేళనం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్న లారీ ఓనర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే లారీ ఓనర్ల ఐక్యత చాటాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరికి ఇలాగే కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ శ్రేయోభిలాషి లాగా వారి కుటుంబ సభ్యులను ఉదాచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు సూచనలు చేయాలని లారీ ఓనర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఓనర్ అసోసియేషన్ కార్యదర్శి చాంద్ పాషా , లారీ ఓనర్స్ అధ్యక్షుడు కుద్దూస్, కార్యదర్శి కరీం, మైనార్టీల సదర్ సబ్ యాదుల్, నజీర్, రహమతుల్లా, ప్రతాప్ రెడ్డి, నారాయణరెడ్డి లారీ ఓనర్స్ సభ్యులు పాల్గొన్నారు.
