నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 18న చేయూత, వికలాంగుల పెన్షన్ దారుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ వస్తున్నట్లు తెలిపారు. చేయూత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం చేయూత పెన్షన్లు 2000 నుంచి 4000, వికలాంగుల పెన్షన్లు 4000 నుంచి 6000, కండరాల క్షీణించిన వారికి 15000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు దగ్గరికి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందన్నారు. ఈ అంశాన్ని ప్రజల ముందు ఉంచడానికి ఈ నెల 18 నాడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో అన్ని సామాజిక పెన్షన్ దారుల, వికలాంగుల మరియు బీడీ కార్మికుల పెన్షన్ దారుల సమావేశం నిజామాబాద్ టౌన్ లోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా నలువైపుల నుంచి పెన్షన్ దారుల వేల సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశి, ఎంఆర్పీఎస్ జిల్లా ఇంచార్జి కుడాల స్వామి మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకులు యమున, వీహెచ్పీఎస్ మహిళా అధ్యక్షులు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
