18న చేయూత పింఛన్ దారుల సన్నాహక సమావేశం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 18న చేయూత, వికలాంగుల పెన్షన్ దారుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ వస్తున్నట్లు తెలిపారు. చేయూత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం చేయూత పెన్షన్లు 2000 నుంచి 4000, వికలాంగుల పెన్షన్లు 4000 నుంచి 6000, కండరాల క్షీణించిన వారికి 15000 రూపాయలు పెంచుతామని...