25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వేసవి వేడిలో శరీర ద్రవాల లోపం నివారణకు జాగ్రత్తలు అవసరం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డా అంజలి రెడ్డి జనరల్ ఫిజీషియన్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమయానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని డా. అంజలి రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వేసవి కాలంలో డీహైడ్రేషన్ కేసులు అధికమవుతున్నాయని ఆమె తెలిపారు. ఎండ తీవ్రత, అధిక చెమటలు, తగినంత ద్రవాలు తీసుకోకపోవడం వల్ల శరీరంలో నీరు, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయని, డయేరియా వంటి వ్యాధుల సమయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని, అయితే హిట్ స్ట్రోక్, మసిల్ క్రాంప్స్, రోజువారి పనులు, తీవ్రమైన శారీరక శ్రమ క్రీడల సమయంలో కూడా డిహైడ్రేషన్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. వేసవిలో దాహం ఎక్కువగా ఉండటం, బలహీనత, తలనిరుత్తరం, నోరు ఎండిపోవడం, మూత్రం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే అది డీహైడ్రేషన్ సంకేతం కావచ్చని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బయట పని చేసే వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఓఆర్ఎస్ ద్రావణం వేసవిలో శరీరానికి అవసరమైన ద్రవాలు, లవణాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందన్నారు. కేవలం నీరు తాగడం కాకుండా, కొబ్బరి నీళ్లు, అవసరమైనప్పుడు ఓఆర్ఎస్ లేదా ఎలక్ట్రోలైట్ ద్రావణాలు తీసుకోవడం మంచిదని తెలిపారు. రోజుకు తగినంత నీరు తీసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తల కవర్ చేసుకోవాలని, ఎక్కువ ఎండలో పనులు చేయకుండా మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకోవాలని, విరేచనాలు, వాంతులు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలని అన్నారు.

More articles

Latest article