నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ నగర్ మేయర్ పీఠాన్ని 16 ఏళ్ల తర్వాత దక్కించుకోవడం గర్వకారణమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. తాను నగర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం పట్ల బొబ్బిలి రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు.
