26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కాళోజి పురస్కారం అందుకున్న ప్రవీణ్ శర్మ

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ శర్మ శుక్రవారం కాళోజి నారాయణరావు జాతీయ సాహిత్య పురస్కారం అందుకున్నారు. వసుంధర విజ్ఞానమండలి, వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యం లో ప్రతి సంవత్సరం సాహిత్య పరంగా విశేష కృషి చేస్తున్న వారికి ఈ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుందని ఉపాధ్యాయుడు ప్రవీణ్ శర్మ తెలిపారు. బాల సాహిత్య పరంగా విద్యార్థులలో సాహిత్య అభిరుచిని పెంచుతూ, బాల సాహిత్యంలో విశేష కృషి జరుపుతున్నందుకు ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ పురస్కారాన్ని రవీంద్ర భారతి వేదికగా హైదరాబాద్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి బాలాచారి, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాగేశ్వర్ శంకర్, వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షులు మధుకర్ వైద్యులు ఈ పురస్కారాన్ని ప్రవీణ్ శర్మకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ కాళోజి నారాయణ రావు జాతీయ పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం ప్రవీణ్ శర్మను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

More articles

Latest article