కాళోజి పురస్కారం అందుకున్న ప్రవీణ్ శర్మ
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ శర్మ శుక్రవారం కాళోజి నారాయణరావు జాతీయ సాహిత్య పురస్కారం అందుకున్నారు. వసుంధర విజ్ఞానమండలి, వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యం లో ప్రతి సంవత్సరం సాహిత్య పరంగా విశేష కృషి చేస్తున్న వారికి ఈ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుందని ఉపాధ్యాయుడు ప్రవీణ్ శర్మ తెలిపారు. బాల సాహిత్య పరంగా విద్యార్థులలో సాహిత్య అభిరుచిని పెంచుతూ, బాల సాహిత్యంలో విశేష కృషి జరుపుతున్నందుకు ఈ పురస్కారాన్ని...