29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అనుమతులు ఉంటే రాత్రి వేళ తవ్వకాలు ఎందుకు ?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పోలీస్, రెవెన్యూ శాఖల మౌనమేలా ?

 

కోటగిరి, బతుకమ్మ :

 

అనుమతులు పొంది పగలు తవ్వకాలు చేపట్టి రవాణా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ నిబంధనలను అతిక్రమించి రాత్రి సమయాలలోనే గుట్టలు స్వాహా చేస్తున్నారు.

 

If there are permits, why are there excavations at night?

 

కోటగిరి మండల శివారులో రాంపూర్ గుట్ట నుంచి గత 15 రోజులుగా తవ్వకాలు చేపట్టుతున్నప్పటికీ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కనీసం స్పందించడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కఠిన నిబంధనలు అమలు చేస్తామని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ రాత్రి సమయాలలో ఇసుక మొరం తవ్వకాలు అక్రమ రవాణాలను క్షేత్రస్థాయిలో సిబ్బంది అదుపు చేయలేకపోతున్నారు. మండల స్థాయి అధికారుల సహకారంతోనే రాత్రి సమయాలలో వనరుల తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

If there are permits, why are there excavations at night?

 

రాంపూర్ శివారు లోని గుట్టలో తవ్వకాలు నిలిపివేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. మొరం కాంట్రాక్టర్లకు మద్దతు ఇస్తూ రాత్రి సమయాలలో ఇసుక రవాణాకు పోలీస్, రెవెన్యూ అధికారులు తెర లేపుతున్నారనే విమర్శలు వెళువెత్తుతున్నాయి.

More articles

Latest article