బతుకమ్మ, బోధన్ : బోధన్ శివాలయంలో ప్రముఖులు, ప్రజల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమైక్య ఆర్గనైజర్ సెక్రటరీగా ఎన్నికైన ప్రవీణ్ మహారాజ్ గారికి ఘన సన్మానం నిర్వహించారు. జిల్లా స్థాయి మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ ప్రత్యేక స్థానం సంపాదించినందుకు ఈ సన్మానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బోధన్ వీడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారి, ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌ఓ వెంకట నారాయణ, శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, మారుతి మందిర్ చైర్మన్ గుండేడి శంకర్, గౌరవనీయులు ప్రదీప్ గుప్తా, బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు వినోద్ పట్వారి, జనరల్ సెక్రటరీ ఉమానంద్ వైద్య, మహిళా అధ్యక్షురాలు మనోజ్ మనిషా వైద్య, ఏక చక్ర తిరంగా సమితి అధ్యక్షులు అంకు మహేష్, మాజీ కౌన్సిలర్ దామోదర్, అంకు సంతోష్ రెడ్డి, వీడీసీ జనరల్ సెక్రటరీ బుజ్జి శంకర్, వీడీసీ క్యాషియర్ శ్రీనివాస్, సంగ్రామ్ బోదు శేఖర్, శంకర్ తేల కిరణ్, లక్ష్మణరావు పాటిల్, సిరిగిరి మాధవరావు, సేవా సంస్థాన్ అధినేత పద్మా సింగ్ తదితరులు పాల్గొన్నారు.

