24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రశాంత్, జీవన్ తోడు దొంగలు

Must read

📰 Generate e-Paper Clip

. పది నెలల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సంక్షేమంపై దమ్ముంటే చర్చకు రండి

. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు

. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తోడు దొంగలని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి, అమలు చేయని సంక్షేమ పథకాలను తమ కాంగ్రెస్ ప్రభుత్వం పదినెలల కాలంలోనే చేసిందని, దమ్ముంటే ప్రశాంత్, జీవన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు ఆహ్వానించినా వారు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. రైతాంగం, పింఛన్లపై వారం రోజులుగా వారిద్దరూ అబ్దాలను ప్రచారం చేస్తున్నారని, మహిళలపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని విమర్శించారు. జనవరి నుంచి మహిళలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ నాయకులు జావిద్ అక్రమ్, సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్, యువజన కాంగ్రెస్ నాయకుడు రామర్తి గోపి తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article