- నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ కు షాక్
- వార్డ్ మెంబర్ పదవులకు అధికారపార్టీ, కాంగ్రెస్, బిజెపి తీవ్ర పోటీ
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సొంత మండలం నిజామాబాద్ రూరల్ మండలంలోని పాల్దా గ్రామంలో సర్పంచ్ పదవి బిఆర్ఎస్ అభ్యర్థి మున్నూరు ప్రభాకర్ ఏకగ్రీవం గాఎన్నికయ్యారు. రెండు విడత పంచాయతీ నామినేషన్ల సందర్భంగా పాల్ద గ్రామా సర్పంచ్ పదవి కోసం ప్రభాకర్ తప్ప మరెవ్వరు నామినేషన్ దాఖలు చేయలేదు. దీనికి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మద్దతు పలకడంతో ఏకగ్రీవం దిశగా పాల్దా సర్పంచ్ పదవి ఎకగ్రీవమైంది. పాల్దా గ్రామంలో మాత్రం కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులు వార్డ్ మెంబర్ పదవి కొరకు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ నామినేషన్లను వేసారు. పార్టీలు ఏవైనా సరే గ్రామాల్లోని అభివృద్ధి కోసం పని చేసే నాయకుడికి పట్టం కడతారని పలువురు గ్రామస్తులు తెలిపారు. అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులు దగ్గరుండి మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రభాకర్ ఏకగ్రీవం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రానున్న ఐదేళ్ల కాలంలో గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపేందుకు అహర్నిశలు కష్టపడతామని కాపు ప్రభాకర్ హర్షo వ్యక్తం చేశారు.


