27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అందరు ఆమోదించిన అభ్యర్థిని గెలిపించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలందరు ముక్త కంఠం తో ఆమోదించిన అభ్యర్థిని గెలిపించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో మండల కేంద్రం పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ బీయర్ ఎస్ పార్టీకి చెందిన అన్ని బీసీ వర్గాల నాయకులు, కార్యకర్తలు కలిసి ఒక వ్యక్తిని బలపరిచడం గొప్ప విషయం అన్నారు. అందరు ఆమోదించి బలపరిచిన అభ్యర్థి మొండి అశోక్ ను ఎమ్మెల్యే అభినందించారు. అందరు కలిసి బలపరిచిన అభ్యర్థి తరపున మండల కేంద్రం నాయకులు, కార్యకర్తలందరు కలిసి కట్టుగా పని చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రశాంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

More articles

Latest article