33.7 C
Hyderabad

ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ

Srinivas assumes charge as First Town SHO

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ ::

నిజామాబాద్ నగర ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ గా బుక శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన ఎస్ హెచ్ ఓ గా విధుల్లో చేరారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐల బదిలీ లో భాగంగా నార్త్ రూరల్ సర్కిల్ సీఐ గా ఉన్న బుక శ్రీనివాస్ వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ గా నియమితులు అయ్యారు. ఇక్కడ ఎస్ హెచ్ ఓ గా పని చేసిన రఘుపతి ని మల్టి జోన్ ఐజి కార్యాలయం లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ కు స్టేషన్ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. నిజామాబాద్ సబ్ డివిజన్ లో పనిచేసిన అనుభవం తో నగరంలోని స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

More articles

Latest article