24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రైతు మహా సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : ఇందూర్ పట్టణంలో జాతీయ పసుపు బోర్డు భవన కార్యాలయ ప్రారంభానికి భారత హోంమంత్రి అమిత్ షా ఆదివారం హాజరుకానున్నారు. ఈ మహా సభను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో ఎంపీఆర్ కార్యాలయంలో బహిరంగ సభ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బోధన్ మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్, సాలూర మండల అధ్యక్షుడు రాహుబ గంగాధర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్ (చిన్నా), పట్టణ ప్రధాన కార్యదర్శులు రాజులదేవి పవన్ కుమార్, మీర్జాపురం అరవింద్, సీనియర్ నాయకులు గుంత గంగాధర్, ఏనుగంటి గౌతమ్ గౌడ్, కందికట్ల వాసు, గాదె సందీప్, కస్ప లింగం, గంటె శ్రీను, కోన వెంకటేష్, సూర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article