బతుకమ్మ, వేల్పూర్ :-అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేల్పూర్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో వెల్ఫూర్ యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. విజేతలుగా నిలిచిన యువతను ఎస్ఎచ్ఓ సంజీవ్ మెడల్స్ తో సత్కరించి యువతను ప్రోత్సహిస్తూ మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నారు.
