రైతు మహా సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
బతుకమ్మ, బోధన్ : ఇందూర్ పట్టణంలో జాతీయ పసుపు బోర్డు భవన కార్యాలయ ప్రారంభానికి భారత హోంమంత్రి అమిత్ షా ఆదివారం హాజరుకానున్నారు. ఈ మహా సభను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో ఎంపీఆర్ కార్యాలయంలో బహిరంగ సభ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బోధన్ మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్, సాలూర మండల అధ్యక్షుడు...