హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 13వ తేదీన జరిగిన పరీక్షకు 98, 858 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలిసెట్ ఫలితాలను సీటీఈ, ఎస్బీటెట్ చైర్ పర్స్ న్ శ్రీ దేవ సేన ప్రకటించారు. బాలికల విభాగం నుంచి గురుగంటి శ్రీజ, తూమటిలాస్య శ్రీ సంయుక్తంగా మొదటి ర్యాంక్ సాధించారు. తర్వాతి స్థానంలో షేక్ ఫిరా తాన్సిం నిలిచింది. బాలుర విభాగం నుంచి ఉండయాల కౌశిక్ నారాయణ నాలుగో ర్యాంక్, చాట్ల షేక్ మహమ్మద్ షేఫిక్ ఐదు ర్యాంకు, బింగి విక్యావత్ ఆరో ర్యాంక్ సాధించారు.
సత్తా చాటి న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థులు…
నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు పాలిసెట్ ఫలితాల్లో సత్తా చాటారు. ఎంబైపీసీ విభాగంలో ఈదుల్యా శ్రీనిధ 65 వ ర్యాంక్, నందగరి దీప్తి 74 వ ర్యాంక్, షేరు ప్రణీత్ 91 ర్యాంక్ సాధించారు. ఎంపీసీ విభాగంలో చౌదరపుశ్రీనిఖ 9వ ర్యాంక్, పెద్దపాటి ప్రణీత 105, షేరు ప్రణీత్ 141 వ ర్యాంకు సాధించారు.
కామారెడ్డి జిల్లాలో ఎంబైపీసీ విభాగంలో బామన్ రమేశ్ 58, కావేటి సహశ్రీ 113, వీరమల్లురాజ భైరవ్ 125 వ ర్యాంక్ సాధించారు. ఎంపీసీ విభాగంలో పాల్త్యా రాహుల్ 26, వారణాసి అనుప్ కుమార్ 112, బామన్ రమేశ్ 188 వ ర్యాంక్ సాధించారు.