31.7 C
Hyderabad

పోలింగ్ బూత్ రివ్యూ సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయం లో పోలింగ్ బూత్  రివ్యూ సమావేశం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కాసం వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి  పల్లె గంగారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అర్ముర్ నియోజకవర్గం యొక్క బూత్ కమిటీ లను,  క్రియశిలా సభ్యత్వం లను బీజేపీ నియోజకవర్గం ఇంచార్జ్ పాలేపు రాజు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్,  బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి  పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కి అందజేశారు. అనుకున్న సమయానికి బూత్ కమిటీలను, క్రియశిలా సభ్యులను పూర్తి చేసి అందించిన పాలేపు రాజు, కలిగొట గంగాధర్ ను  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఎన్నికల అధికారి కాసం వెంకటేశ్వర్లు అభినందిoచారు.

More articles

Latest article