22.6 C
Hyderabad

వృద్ధురాలి ఇంట్లో చోరీ కేసును చేదించిన పోలీసులు

Police solve theft case at elderly woman's house

Must read

📰 Generate e-Paper Clip

 

 – ముగ్గురు నిందితులు అరెస్ట్

బిచ్కుంద, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ హెచ్ ఓ గుండె ల రాజు తెలిపారు. శనివారం పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ ఓ విలేఖరులతో మాట్లాడుతూ… బిచ్కుంద కేంద్రంలో ఒంటరిగా ఉండే సుంకరి సాయవ్వ ఈ నెల 14న  బంధువుల ఇంట జరిగే విందుకోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు 18న  ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టి రూ.15 వేల నగదు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజ్ ,స్థానికుల సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా  బిచ్కుంద పోలీసులు ముగ్గురిని రాజుల్లా చౌరస్తాలో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. బాన్సువాడ కు చెందిన దాసరి తిరుపతి, బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చౌహన్ అర్జున్, చౌహన్ సురేష్ లను విచారించగా చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించగా  వారి నుంచి రూ.12 వేల నగదు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు. మద్యానికి బానిసై డబ్బుల కోసం చోరీకి పాల్పడిన ముగ్గురిలో బాన్సువాడ కు చెందిన దాసరి తిరుపతి పై ఇప్పటికే 10 చోరి కేసులు ఉండగా, బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చౌహన్ అర్జున్ పై 5 దొంగతనం కేసులు ఉన్నాయి. కేసులను త్వరితగతిన ఛేదించిన బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్ హెచ్ ఓ రాజు, పోలీసు లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

More articles

Latest article