మోర్తాడ్, బతుకమ్మ:పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించినట్లు మోర్తాడ్ ఎస్సై రాము తెలిపారు. అమరులైన పోలీస్ వీర జవానుల జీవితాలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు.
