26.2 C
Hyderabad

పేకాట క్లబ్ పై పోలీసుల దాడి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం,  బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని 6 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపురి హిల్స్ లోని పేకాట క్లబ్ పై పోలీసులు దాడి నిర్వహించారు. స్థానికంగా ఏ వన్ టెంట్ హౌస్ యజమాని రిజ్వాన్ నివాసంలో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు  స్థానిక ఎస్సై వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించి తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుంచి రూ. 51 వేల నగదు తో పాటు 8 సెల్ ఫోన్లు,  8 వాహనాలను సీజ్ చేశారు. సంబంధిత పేకాట క్లబ్ ను స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ గా నమోదైన డాన్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

More articles

Latest article